ఖలిస్థానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్(Amritpal Singh) తప్పించుకుపోయిన వ్యవహారంలో పోలీసుల తీరుపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్ సింగ్ తప్పించుకోవడం రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. 80 వేల మంది పోలీసులు ఉన్నారని.. అయినా అమృత్ పాల్ సింగ్(Amritpal Singh) ఎలా తప్పించుకున్నాడని పంజాబ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు చేశామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
అటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పష్టంచేశారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.
Read Also: ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్.. భయాందోళనలో స్థానికులు
Follow us on: Youtube Instagram