ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్.. భయాందోళనలో స్థానికులు

విశాఖపట్టణం(Vizag)లో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పెట్రోల్ ట్యాంకర్ ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది. శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్లాల్సిన భారీ పెట్రోల్ ట్యాంకర్ దిగువ రోడ్డు మార్గంలోకి రావడంతో ఫుట్ ఓవర్ వంతెన కింద ఇరుక్కుపోయి ఆగిపోయింది. పెట్రోల్ ట్యాంకర్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు భారీ క్రేన్ లతో ట్యాంకర్ బయటకు తీసేందుకు మూడు గంటల పాటు శ్రమించారు. లారీని బయటకు తీసే సమయంలో ట్రాఫిక్ జాం అవ్వడంతో ఇతర వాహనాలు ఫ్లై ఓవర్ మీద నుంచి రాకపోకలు సాగించాయి. పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.

Read Also: విజయవాడ దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్