Vijayawada |దుర్గగుడి దుకాణదారులు మెరుపు సమ్మె నిర్వహించారు. కనకదుర్గా నగర్ లో షాపులు మూసి వేసి నిరసన తెలిపారు. లక్షల అద్దెలు కట్టినా సరైన స్థలం కేటాయించలేదని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. షాపులు వీలైనంత లోపలకు జరపాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని దుకాణదారులు వాపోతున్నారు.