Visakhapatnam | విశాఖ జిల్లాలో మరోసారి స్మగ్లింగ్ కలకలం రేపింది. అరికె గింజల స్మగ్లింగ్ ను గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఎండు ఖర్జూరం రవాణా ముసుగులో అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యూఏఈ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్లు చేరాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టగా స్మగ్లింగ్ బయటపడినట్లు వెల్లడించారు. దిగుమతి చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి.. జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. ఈ స్మగ్లింగ్ పై పోలీసులు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Read Also: పాత ఫోన్లను తీసుకొని ఈడీ ఎదుట హాజరైన కవిత
Follow us on: Youtube Instagram