ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు బాయ్ బాయ్ అని కేటీఆర్ కేసుతో రుజువైందన్నారు. గతంలో ఏ కేసులో కూడా ఇంత త్వరగా ఈడీ కేసు నమోదు చేయలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశాకనే ఫార్ములా కేసు నమోదు చేశారని చెప్పారు. ఫార్ములా రేసు కేసును.. రాజ్ భవన్ నుంచి నడిపించారని… ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీల ప్లాన్ అని ధ్వజమెత్తారు.