బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన హస్తకళా ఆర్టిషన్స్ ఫౌండేషన్ వ్యవస్ధాపకులు శ్రీదేవి విజయ దాస్ ఆదివారం నాడు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, చేనేత కారులతో విభిన్న రకాల హ్యాండ్ లూమ్ చీరల తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు.
భారతీయ సంస్కృతి లో పట్టు , హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని శ్రీదేవి విజయ దాస్ అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరు చేనేతకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ… ఈ నెల 29వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు.