పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన..ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం అసలు సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై సినిమా ధరల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారాయన.
తాను సీఎం కుర్చీలో ఉన్నంత కాలం అనుమతిచ్చే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టారు. అయితే స్వయంగా సీఎం రేవంతే..రంగంలోకి దిగి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ పెద్దలకు గుబులు పట్టుకుంది. మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి సందడి మొదలవనుంది. ఈ నేపథ్యంలో పండుగకు విడదలయ్యే సినిమాలకు షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కూడా ఈ అంశంపై టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.