నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ టూర్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించి… పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా పోలేపల్లికి చేరుకుని రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించనున్నారు. BPCL కంపెనీ సహకారంతో ఏర్పాటు కానున్న ఈ బంక్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు.

రాష్ట్రంలోనే ఈ తరహా బంక్‌ మొదటికాగా… దానిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని నారాయణపేట మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్‌తో పాటు ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్