అంగన్వాడి పాఠశాలలో కలుషిత ఆహారంతిని 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడు పెద్దతండ అంగన్వాడి పాఠశాల విద్యార్థులు వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. గురువారం మెనూ ప్రకారం ఉదయం విద్యార్థులకు గుడ్డు, మధ్యాహ్నం ఆహారంలో సాంబారు ఏర్పాటు చేశారు. 18 మంది విద్యార్థులు ఈ ఆహారం తినగా…. సాయంత్రానికి వీరిలో 9 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పిల్లల తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిహెచ్‌సీ బాధిత విద్యార్థులకు ఓఆర్ఎస్, ఇంజక్షన్స్ అందించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జయప్రకాష్ తెలిపారు. కలుషిత ఆహారం, కలుషిత నీరు తీసుకోవడం వలనే పిల్లలు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన పిల్లలో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు.