దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఏర్పాటైందని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోశయ్య తన ఛాంబర్‌కు పిలిపించుకుని విలువైన సూచనలు చేశారని చెప్పారు. ప్రజలకు మేలు కలిగేలా అధికార పక్షాన్ని నిలదీయాలని చెప్పారని గుర్తు చేశారు. రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేశారని తెలిపారు. పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను.. ప్రతిపక్షంలో ఉంటే సీఎంగా ఉన్న వ్యక్తిని ఇరుకున పెట్టే విధానాన్ని ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోశయ్య మూడో వర్ధంతి సందర్భంగా నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.