స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన సినీ, రాజకీయ మేరునగ శిఖరం స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని వైఎస్ఆర్టీపీ నాయకురాలు వైఎస్. షర్మిల పేర్కొన్నారు. పేదల సంక్షేమమే శ్వాసగా బతికి అనేక సంస్కరణలతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడిపించి.. పేదలకు కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి, పేదరిక నిర్మూలనకు కృషి చేశారని కొనియాడారు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలతో అందరినీ మెప్పించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించారని తెలిపారు. ఈ రోజు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా వారికి ఘన నివాళులు అర్పించారు.