స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు మాజీ ఎంపీ, హీరో చిరంజీవిలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి రాజకీయం తెలియదని.. అసలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి ముఖ్యమంత్రి కావాల్సిందనన్నారు. అయితే రాజకీయ అనుభవం లేక సీఎం కాలేకపోయారని తెలిపారు. కేవలం రెండు సామాజిక వర్గాలే 75 ఏళ్లుగా ఏపీని దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
ఇక జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరని.. ఆయన పని అయిపోయిందని విమర్శించారు. 2024లో ఏపీలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో పేదలు పేదలుగానే మిగిలిపోయారన్నారు.