స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ను జైలు అధికారులు రెండు నుంచి ఒకటికి కుదించిన విషయం తెలిసిందే. ములాఖత్‌లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు. లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు
Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని న్యాయవాదుల పిటిషన్
0
279
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


