స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఎప్పుడు అయితే వచ్చిందో అప్పటి నుంచే అధికారులు, పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట లక్షలాది రూపాయల నగదు పట్టుబడుతున్న విషయాలను మనం చూస్తున్నాం. కానీ తాజాగా గద్వాల్ దగ్గర రూ. 750 కోట్లు పట్టివేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నికల కోసం ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారా.? అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. కేరళ నుంచి తెలంగాణకు లారీలు భారీగా డబ్బు తరలింపు చేపట్టారు. ఓ పెద్ద లారీలు 500 రూపాయల నోట్ల కట్టలు దాదాపు 750 కోట్లు కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు. లారీ డ్రైవర్ ను పట్టుకొని విచారిస్తున్నారు అధికారులు. ఇంకా ఎన్ని లారీలు ఉన్నాయి.. కేవలం ఇవేనా..? ఇంకా నగదు ఉందా..? అసలు ఎవరు పంపించారు..? ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల ద్వారానే ఈ డబ్బును తరలిస్తున్నట్టు నిర్దారణ అయినట్టు సమాచారం.