ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లల్లో చేరుకున్నారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవోటెల్ వరకు సీఎం సైకిల్ సవారీ చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ చేరుకున్నారు ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబుఎర్రటి ఎండ కాస్తున్నా ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రయాణాన్ని సాగించారు. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబుతో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సైకిల్ తొక్కిన చంద్రబాబు
0
64
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


