సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డీఎన్‌ఏలోనే ఉందని మండిపడ్డారు. వైసీపీ నేతలు, జగన్ బతుకే ఓ ఫేక్ బతుకని దుమ్మెత్తి పోశారు. పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఎక్కడా ఆదేశించలేదని తెలిపారు. పెన్షన్ల విషయంలో జరుగుతున్నది అంతా పెద్ద రాజకీయ కుట్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ప్రజలు ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ను 4 వేలకు పెంచి, ఆంక్షలు ఎత్తివేసి ఇంటివద్దే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు
0
470
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


