స్వతంత్ర, వెబ్ సైట్: తెలంగాణ వస్తే నక్షలైట్ల రాజ్యం వస్తుందని..హైదరాబాద్ ల కర్ఫ్యూ ఉంటుందని..అంతా చీకటేనని చాలా మంది చెప్పారు. ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని.. కేంద్రమే తెలంగాణకి అవార్డులు ఇస్తుందని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యతిరేఖ శక్తులకు ఇది చెంపపెట్టు అవుతుందని అన్నారు. తెలంగాణ విభజనని వ్యతిరేకించి తప్పు పని చేశానని లగడపాటి అన్నట్టు గుర్తు.. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేడు. నవ్విన చోటే నాప పండు పండించినట్టు కేసీఆర్ తల ఎత్తుకునేలా చేశారని వ్యాఖ్యానించారు.
కేంద్రం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకుందని ఎద్దేవా చేశారు. మనం బాగా ఆడిట్ బాగా చేస్తున్నామని మన దగ్గర ఉన్న ఆడిట్ డైరెక్టర్ ని ఢిల్లీకి పిలుచుకున్నారని తెలిపారు. మన సర్పంచులు అందరూ ఓ బస్సులో వెళ్లి గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడండి.డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనానికి..BRS మోడల్ సర్కార్ పని తనానికి తేడా తెలుస్తుందని రైతులకు చెప్పారు. అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా కరెంట్ సరిపోవట్లేదు కరెంట్ పొదుపుగా వాడాలని చెప్పారు. అలాంటిది కరెంట్ విషయంలో మనకి ఢిల్లీల అవార్డులు ఇస్తారు..గల్లీల తిడుతున్నారని ఎద్దేవా చేశారు.
ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యింది. ధరణి రాకముందు రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ చెబుతుంది. ఒకవేళ ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకె రైతు బంధు ఇస్తారు. నిజాలను ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది.కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుంది. తెలంగాణ దేశానికి దిక్సుచిగా నిలవాలంటే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పిలుపు నిచ్చారు.