CBRE Survey |అద్దెకు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఇచ్చేసేయండి.. రెండేళ్ల తర్వాత ఇల్లు అద్దెకు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోనుంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ CBRE ఇండియా వాయిసెస్ ఫ్రమ్ ఇండియా పేరుతో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 45శాతం మంది భారతీయులు రాబోయే రెండు సంవత్సరాల్లో కొత్త ఇంటిని కొనాలని భావిస్తున్నారని ఈ సర్వేలో తేలింది.
CBRE Survey | ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా.. అందులో 15వందల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో జెన్-Z(18-25సంవత్సరాలు), లేట్ మిలీనియల్స్(26-33), ఎర్లీ మిలీనియల్స్(34-41), జెన్-X (42-57),బేబీ బూమర్స్(58 సంవత్సరాలు) దాటిన వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇళ్ల కొనుగోలు విషయంలో వడ్డీ రేట్లు పెద్దగా ప్రభావం చూపించడం లేదని ఇండియా మార్టిగేజ్ గ్యారెంటీ కంపెనీ(IMCG)తన నివేదికలో పేర్కొంది. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచినా రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు హౌసింగ్ లోన్స్ కు డిమాండ్ పెరిగిందని IMCG తెలిపింది.