బండి భగీరద్ పోక్సో వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు

బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంలో హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, దుష్ప్రచారం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు జాయింట్ సీపీ శ్వేత ఆధ్వర్యంలో సిట్ పనిచేయనుంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, సంబంధిత జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు వైరల్ కావడంతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ దుష్ప్రచారంపై హైకోర్టు రిజిస్ట్రార్ మే 16న చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మొదట కేసు నమోదు చేసి, అనంతరం దీనిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పోస్టులు వ్యాప్తి చెందినందున డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు రంగంలోకి దిగారు.

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దామోదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ డేటా, పోస్టుల మూలాలు, వాటి వ్యాప్తిపై అధికారులు సాంకేతికంగా విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేసు ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి సిట్‌ను ఏర్పాటు చేశారు. జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలోని ఈ బృందం కేసులోని అన్ని కోణాలను పరిశీలించనుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం, వ్యక్తిగత ఆరోపణలు వంటి అంశాలను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్