జలమండలి జనరల్‌ మేనేజర్‌ కుమార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మరో కీలక అధికారిపై దృష్టిసారించారు. రెడ్‌హిల్స్‌ జలమండలి జనరల్‌ మేనేజర్‌ కుమార్‌కు చెందిన నివాసాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి విస్తృత సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.

హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న కుమార్‌ నివాసానికి ఉదయం వేళనే చేరుకున్న ఏసీబీ బృందాలు ఇంటిని పూర్తిగా తనిఖీ చేశాయి. అదే సమయంలో ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులు, బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయిన అధికారులు పలు ప్రాంతాల్లో రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తి పత్రాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

సోదాల సందర్భంగా భారీ మొత్తంలో నగదు బయటపడినట్టు సమాచారం. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పెట్టుబడుల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. కొన్ని బ్యాంక్‌ లాకర్ల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం.

కుమార్‌ సేవా కాలంలో సంపాదించిన ఆస్తులు ఆయన అధికారిక ఆదాయానికి మించి ఉన్నాయనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టిన అధికారులు, ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే ఈ సోదాలకు దిగినట్టు సమాచారం.

సోదాలు పూర్తయ్యాక స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తి పత్రాల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు పలు డిజిటల్‌ పరికరాలను కూడా పరిశీలిస్తూ కీలక సమాచారం సేకరిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్