సీఎం విజయ్‌కు బహుమతి ఇచ్చిన డైరెక్టర్‌

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్‌కు ఓ అరుదైన బహుమతి లభించింది. ఈ బహుమతి ఇచ్చింది ఎవరో కాదు..గతంలో విజయ్‌తో సినిమా తీసిన దర్శకుడే వెంకట్‌ ప్రభు ఈ బహుమతిని అందించారు. విజయ్‌, వెంకట్‌ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన దిగోట్‌కు సంబంధించిన ఓ గిఫ్ట్‌ను విజయ్‌కి అందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన విజయ్‌ పాత్ర ఉపయోగించిన కారుకు సంబంధించిన ఐకానిక్‌ నంబర్ ప్లేట్‌ TN07CM2026ను విజయ్‌కి బహుమతిగా అందించారు. తమిళనాడు సీఎంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అగ్రకథానాయకుడు విజయ్‌ను దర్శకుడు వెంకట్‌ ప్రభు మర్యాదపూర్వకంగా కలిసి గిఫ్ట్ ను ప్రదానం చేశారు.

2024, ఫిబ్రవరిలో విజయ్‌ తమిళగ వెట్రి కజగం-టీవీకే పార్టీ స్థాపించిన కొన్ని నెలలకే దిగోట్‌ సినిమా విడుదలైంది. ఆ సినిమాలోని TN07CM2026 అనే నంబర్‌ ప్లేట్‌ ఉన్నకారును విజయ్‌ నడుపుతుంటారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ రాజకీయప్రస్థానాన్ని, విజయ్‌ సీఎం అవుతారనే విషయాన్ని ఈనంబర్‌ప్లేట్‌తో అప్పట్లోనే సూచించారంటూ ఇటీవల కొన్ని రీల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ నంబర్‌ ప్లేట్‌ను ఫ్రేమ్‌ కట్టించి విజయ్‌కు అందించారు.

ఈ ఫొటోలను వెంకట్‌ప్రభు ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. విజయ్‌చరిత్ర సృష్టించారు. సీఎం విజయ్‌ను కలిసి మొదటి అపురూప కానుకను ప్రెజెంట్‌ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే TN07CM2026 అని రాసుకొచ్చారు. మే 10న చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్‌ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్‌-2026 ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాల టాక్.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్