మంచు మనోజ్.. మాస్టర్ ప్లాన్..

మంచు మనోజ్.. ఒకప్పుడు చాలా స్పీడుగా సినిమాలు చేశాడు. ఆతర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మంచు వారబ్బాయి రీసెంట్ గా విలన్ గా మారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. నేను హీరో… విలన్ గా చేయడం ఏంటి అనుకున్నాడేమో కానీ.. మళ్లీ హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు. డేవిడ్ రెడ్డి అంటూ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ఇక ఈ భారీ చిత్రంలో గెస్ట్ రోల్ లో ఓ స్టార్ హీరో నటించనున్నాడని ప్రచారం జరుగుతుండడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఐక్య ధైర్య సేన సమితి అంటూ కొత్తగా సామాజిక సేవా సంస్థను కూడా ప్రారంభించాడు మనోజ్. ఓ వైపు రీల్ లైఫ్.. మరో వైపు రియల్ లైఫ్ లోనూ హీరోగా శభాష్ అనిపించుకోవడానికి మాస్టర్ ప్లానే రెడీ చేశాడు. అదేంటో చూసేద్దాం రండి..

మంచు మనోజ్ నటిస్తున్న డేవిడ్ రెడ్డి మూవీని డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా మూవీగా డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా డేవిడ్ రెడ్డి సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఇప్పటి వరుకు రాకింగ్ స్టార్ గా పిలవబడుతున్న మంచు మనోజ్ ఇకపై రా కింగ్ మంచు మనోజ్ ట్యాగ్ తో మన ముందుకు రాబోతున్నారనే విషయాన్ని తెలియచేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న డేవిడ్ రెడ్డి టీజర్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న డేవిడ్ రెడ్డి చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్ లో కనిపించనున్నారు. ఇప్పటికే డేవిడ్ రెడ్డి సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మనోజ్ కు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని డేవిడ్ రెడ్డి సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఆ గెస్ట్ రోల్ ను రామ్ చరణ్ తో చేయించనున్నారని ఆమధ్య ప్రచారం జరిగింది. అయితే.. ఈ గెస్ట్ రోల్ ఎవరితో చేయించనున్నారు అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లి లో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తమ కొత్త సామాజిక సేవా సంస్థ ఐక్య ధైర్య సేన సమితిని అధికారికంగా ప్రారంభించారు. “Unity, Courage, Service, Impact” అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించామని మనోజ్ చెప్పారు. ఈ ట్రస్ట్ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాదు. మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా పని చేస్తుందని.. నమస్తే వరల్డ్ అనే సంస్థను కూడా ప్రారంభించామని.. దాని ద్వారా టాయ్ మేకింగ్ కోర్సుల సహకారంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి అన్నారు. మొత్తానికి మనోజ్ మాస్టర్ ప్లానే రెడీ చేశారు. మరి.. డేవిడ్ రెడ్డి మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎంత వరుకు మెప్పిస్తారో చూడాలి

Latest Articles

ఏఐఎంఐఎం కార్పొరేట్ పాలిటిక్స్‌ను పాతబస్తీ ఆదరిస్తుందా?

రాజకీయాల్లో ఏదైనా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ఏళ్ల తరబడి లీడర్ల చుట్టూ తిరగాలి. పార్టీ ఫండ్ సమర్పించుకోవాలి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్