ఎండ తీవ్రతకు ఏసీ గదుల్లో కూడా నిద్ర రావడం లేదు- వైద్యులు ఏం చెబుతున్నారు?

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవతుఉన్నారు ఎయిర్ కండిషనర్ గదుల్లో నిద్రపోయినా చాలా మందికి సరిగా నిద్రపట్టడం లేదు. రాత్రి మధ్యలో పలుమార్లు మేల్కొనడం, అధిక చెమటలు, ఉదయం తలనొప్పి, పగటిపూట అలసట వంటి సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైద్యులు ఏం చెబుతున్నారంటే…

తీవ్ర ఎండలు , రాత్రిపూట కూడా తగ్గని ఉష్ణోగ్రతలు శరీరంలోని సహజ ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. సాధారణంగా మంచి నిద్ర కోసం శరీర ఉష్ణోగ్రత రాత్రివేళ స్వల్పంగా తగ్గాలి. కానీ వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ సరిగా పనిచేయక నిద్రలో మెలుకవ వచ్చి నిద్రపట్టని పరిస్థితి ఏర్పడుతుంది.

ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవి కుమార్ మాట్లాడుతూ.. “ఇటీవల ఎసీ గదుల్లో నిద్రపోయినా నిద్ర సమస్యలతో వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధిక వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ దెబ్బతిని నిద్రకు అంతరాయం ఏర్పడుతోంది” అని తెలిపారు.

వైద్యులు గమనిస్తున్న ప్రధాన లక్షణాలు

1…రాత్రి పలుమార్లు మేల్కొనడం
2..అధిక చెమటలు పట్టడం
3…ఉదయం తలనొప్పి
4..పగటిపూట అలసట
5..చిరాకు
6..ఏకాగ్రత లోపించడం

అలాగే ఆస్తమా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, అలెర్జీ శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిలో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అధిక వేడి, డీహైడ్రేషన్ కారణంగా శ్వాసనాళాలు ప్రభావితమవుతుండగా, చాలా చల్లటి ఎసీ గాలి గొంతు పొడిబారడం, ముక్కు బ్లాక్ అవడం వంటి సమస్యలకు దారితీస్తోందని అంటున్నారు.

చాలా చల్లటి ఎసీ కూడా ప్రమాదమే!

ఎండల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చాలా మంది ఎసీని అత్యల్ప ఉష్ణోగ్రతకు సెట్ చేస్తుంటారు. అయితే ఇలా ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి వెళ్లడం కూడా నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డాక్టర్ అవి కుమార్ మాట్లాడుతూ.. “అత్యధిక వేడి తర్వాత అకస్మాత్తుగా చాలా చల్లటి గదిలోకి వెళ్లడం వల్ల గొంతు సమస్యలు, కండరాల అసౌకర్యం, నిద్రలో అంతరాయం ఏర్పడవచ్చు” అని తెలిపారు.

వేడి వల్ల ఒత్తిడి, బీపీ సమస్యలు

నిద్రలేమి కేవలం అలసటకే పరిమితం కాదని, దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై కూడా పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా నిద్ర భంగం కలిగితే ఒత్తిడి పెరగడం, రక్తపోటులో మార్పులు రావడం, రోజువారీ పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎండాకాలంలో మంచి నిద్ర కోసం ఏం చేయాలి?

1..రోజంతా తగినంత నీరు తాగాలి
2…నిద్రకు ముందు కాఫీ, టీ వంటి కెఫిన్ పదార్థాలు తగ్గించాలి
3…రాత్రిళ్లు మితంగా తినాలి
4…గది ఉష్ణోగ్రతను మితంగా ఉంచాలి
5…ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవాలి
6….గదిలో గాలి ప్రసరణ బాగుండేలా చూసుకోవాలి
7…కాటన్ బెడ్‌షీట్లు ఉపయోగించాలి
8…నిద్రకు ముందు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలి

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?

తరచుగా నిద్రలేమి, గట్టిగా గురక పెట్టడం, పగటిపూట అధిక నిద్రమత్తు, నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి స్లీప్ అప్నియా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలకు సంకేతాలు కావచ్చని చెబుతున్నారు.

వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేవలం ఎసీపై ఆధారపడకుండా, శరీరానికి తగిన హైడ్రేషన్, సరైన గది ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్