పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అవారన్ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించిన ఈ వరదల్లో ఓ కారు కొట్టుకుపోగా అందులో ఉన్న 8 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వరద బీభత్సం కారణంగా లక్షలాది మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరాతోపాటు.. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.