వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ప్రియాంకగాంధీ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాకం.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ఎన్నికల పోరు మరింత రక్తి కట్టిస్తోంది. ప్రియాంకతో పోటీకి నవ్య హరిదాస్ అనే మహిళా కీలక నేతను బీజేపీ రంగంలోకి దింపింది. ప్రియాంక, నవ్య మధ్య నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల పోటీ నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక వయనాడ్‌తోపాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరుగుతోంది.