ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ ట్రైన్‌ను కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు….రాష్ట్ర ఎంపీలకు ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వివిధ విషయాలపై మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీలో అందుబాటులో ఉన్న కొందరు కూటమి ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన గురించి చెప్పారు. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్‌ను కేంద్ర ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మార్గాల్లో ఈ హై స్పీడ్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో దక్షిణాదిలో రెండు మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకూ ఒక ట్రైన్, ముంబాయి నుంచి హైదరాబాద్‌కు మరో ట్రైన్‌ను ఇందులో ప్రతిపాదించారు. మొదటి దశ ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ లేదు. కాని తాజాగా ఏపీని కూడా ఇందులో చే ర్చినట్లు ముఖ్యమంత్రి…. ఎంపీలకు తెలిపారు. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి నగరాలు కలిసేలా బుల్లెట్ రైళ్లు నడపడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ వేయాల్సి ఉంటుందని, పూర్తి ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.