మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. నాడు కేసీఆర్‌తో సాధ్యం, నేడు కాంగ్రెస్‌తో అసాధ్యమంటూ ఆరోపణలు చేశారు. పేద విద్యార్థులతో సర్కార్ చెలగాటమాడుతుందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దీనికి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు.