తెలంగాణ భవన్ లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారం అందచేయనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు అందచేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు. కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 18న జరగనున్న సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక సమావేశం
0
186
Previous article
Next article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


