యాదాద్రిలో నిత్యకళ్యాణానికి బ్రేక్.. మళ్ళీ ఎప్పటినుంచంటే?

Yadadri | తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రిలో మంగళవారం నుంచి యాదగిరీశుని జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీగా జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. ఈ విషయాన్ని కల్యాణం మొక్కులను నిర్వహించే భక్తులు గమనించాలని తెలిపారు. స్వామి వారి ఉత్సవాలు పూర్తయిన తరవాత మే 5వ తేదీ నుంచి నిత్యకల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే యాదాద్రికి అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2 నుంచి 4వ తేదీ వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

Latest Articles

ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0

సిమ్ మాఫియాపై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఉక్కుపాదం సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు అందిస్తున్న 56 మంది అరెస్టు ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0 చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 13 రాష్ట్రాల్లో దాడులు 7 రోజుల పాటు 18...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్