25.8 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

లోక్‌సభలో బండి సంజయ్‌ భావోద్వేగ వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) సవాల్‌ విసిరారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పిన బీఆర్ఎస్(Brs) ఎంపీ నామా నాగేశ్వరరావు.. దానిని నిరూపించాలని.. లేని పక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. లోక్‌సభలో (Lok Sabha)అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అవినీతి యూపీఏ కూటమి.. ఇండియాగా ఎలా మారిందో.. ..కుటుంబ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు.

బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్‌ రాక్షస సమితి అని చురకలంటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రిజ్వీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని… అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు పెరిగాయని ఆరోపించారు. సీఎం భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయని వెల్లడించారు. తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ.1,12,236 అయితే..సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం ద్వారా ఆదాయం రూ.కోటి. కుమారుడి వ్యవసాయ ఆదాయం రూ.59,85,000 ఆదాయం అర్జించారని చెప్పారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగలేదు కానీ..ముఖ్యమంత్రి కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్