కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. దీంతో పులివెందులలోని అతని ఇంటికి చేరుకున్న పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నవంబరు 8న రాఘవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులో రాఘవరెడ్డిని 20వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వ్యవహరిస్తున్నారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు.