ఏపీలో నెట్ వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు. ప్రజల పాలిట ఆరోగ్యశ్రీ సంజీవని అని ఆమె అన్నారు. ట్రస్ట్ మోడల్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడల్ కు మార్చడం తగదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందన్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడంతో ఆ ఆసుపత్రులు వైద్యాన్ని నిలిపివేశాయని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద 13,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, గతంలో 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ 5,100 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. లాభాపేక్షతో పనిచేసే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆరోగ్య ట్రస్ట్ పనులు అప్పగిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని సమీక్షించి ఆరోగ్యశ్రీలో హైబ్రిడ్ విధానానికి స్వస్తి చెప్పి, ట్రస్టు మోడల్‌నే కొనసాగించాలని డిమాండ్ చేశరు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఇలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజల పక్షాన వైయస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని విడదల రజిని హెచ్చరించారు.