ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కేసుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. తప్పు ఒప్పులు తేల్చేది కోర్టులేనని.. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని చెప్పారు.
కోర్టులు, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదు. మాకు BRS నాయకులు టార్గెట్ కాదు…మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు?. కేటీఆర్ మారలేదు..ఆయన రైటర్ మారినట్లుంది. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న BRS చెప్పాలి. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయి. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్ళాయో తేలాలి. ప్రాంతీయ పార్టీల్లో రిచెస్ట్ పార్టీ BRS… అంత డబ్బు ఎలా వచ్చింది? కేసీఆర్ ఏ కేసులో ఉన్నా …హరీష్ అక్కడ ఉంటారు. కావాలని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదు.
ఏది బయట పడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్‌లు బిఆర్ఎస్ వాళ్లు అడిగితేనే వేశాం. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములాపై విచారణ వారే అడిగారు. కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదు. సిస్టంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటపడుతున్నాయి. జైలుకు వెళ్తేనే సిఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కాదు. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వస్తాయి.
జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదు. సంక్రాంతి పండుగ తరువాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నాం. భూదాన్, దేవాదాయ, అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయటపడతాయి. సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుంది. భూభారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుంది.
రూల్స్ ఫ్రేమ్ చేయడానికి రెండు నెలల టైం పడుతుంది. సియోల్ బాంబులు పేలడం మొదలు అవుతున్నాయి. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అవ్వలేదు…కొనసాగుతుంది. నేను మంత్రి అయ్యాక మా జిల్లా మాజీ మంత్రి నేను ఎదురుపడలేదు. అసలు ఉన్నాడా? లేడా అన్నట్లు నడుస్తోంది… అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు