24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) హాజరయ్యారు. అవినాశ్ వెంట వైసీపీ కార్యకర్తలు, అనుచరులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో భాస్కరరెడ్డి(YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy)తో కలిపి అవినాశ్ ను విచారించనున్నారు. ఈనెల 24వరకు అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయనున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరుకాగా ఆయన నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించారు.

కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈనెల 25వరకు అవినాశ్(Avinash Reddy)ని అరెస్ట్ చేయవద్దని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు చంచల్ గూడ(Chanchalguda) జైలులో ఉన్న భాస్కరరెడ్డికి బీపీ పెరగడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Read Also:  మందుబాబులా మజాకా.. 17రోజుల్లో కోటి బీర్లు తాగేశారు

Follow us on:   YoutubeKooGoogle News

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్