స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు ముమ్మరంగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటుకు సివిల్ ఏవియేషన్ శాఖ అంగీకరించింది. త్వరలోనే మణిపూర్ లో ఉన్న విద్యార్థులను ఏపీకి తరలించనుంది.