అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన

AP Assembly |రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నామ సంవత్సరం కావటంతో బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గ‌తేడాది కంటే ఎక్కువ అంచ‌నాల‌తో బ‌డ్జెట్ రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీ స‌ర్కార్ ప్రవేశ‌పెడుతున్న చివ‌రి పూర్తి స్థాయి బడ్జెట్ కావ‌డంతో ఎన్నిక‌ల బ‌డ్జెట్ ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉదయం 10 గంటలకు అసెంబ్లీ(AP Assembly) లో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సమర్పిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజు  ప్రవేశపెడతారు.

Read Also: ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి నుంచి భట్టి పాదయాత్ర

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్