ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాదయాత్ర చేపట్టనున్నారు. పిప్రీ గ్రామం నుంచి ప్రారంభ కానున్న ఈ యాత్రకు.. అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు వచ్చి పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. నేడు మొదలు కానున్న ఈ పాదయాత్ర… ఆదిలాబాద్ జిల్లాలో 240 కిలోమీటర్లు సాగనుంది. ఏప్రిల్ 2న మంచిర్యాలలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో అధికార BRS, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర పార్టీ అగ్రనాయకులు తమ పాదయాత్రలతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి వీరు చేస్తున్న ప్రయత్నంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి మరి.