ఆంధ్రప్రదేశ్: మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు (57) మృతి చెందారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైజాగ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆనందరావు.. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈయన సంఘ సేవకునిగా కూడా పనిచేశారు. ఆనందరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.