తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. అది కూడా అతిరథ మహారథులు పాల్గొన్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ వేదికపైన. ఈవెంట్ ముగింపు సందర్భంగా చీఫ్ గెస్ట్‌గా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ హైటెక్స్‌లోని HICCలోకి రేవంత్ రెడ్డి రాగానే ఆయనకు ఆహ్వానం పలుకుతూ యాంకర్‌గా వ్యవహరిస్తున్న నటుడు బాలాదిత్య టంగ్ స్లిప్ అయ్యారు. మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అనడానికి బదులుగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్‌కుమార్ అంటూ ఆహ్వానించారు. దీంతో అక్కడ సభకు హాజరైన వారందరూ ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడు అర్ధమైంది. తన తప్పు తెలుసుకున్న వెంటనే బాలాదిత్య నాలుక కరుచుకున్నారు.
ఇంకేముంది కొద్దిసేపటికే తేరుకున్న యాంకర్ సారీ చెప్పారు. ముఖ్య అతిథి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వెల్ కమ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరో యాంకర్ , నటుడు జైలుకు వెళ్లబోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలాదిత్యకు జాగ్రత్తలు సైతం చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ సలహాలు ఇస్తున్నారు.
ఇప్పటికే పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కూడా ఈవెంట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్లే సంథ్య థియేటర్ కేసులో జైలుకు పంపారని సోషల్ మీడియాలో టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా మరో యాక్టర్ కూడా జైలుకు వెళ్లక తప్పదా .. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.