రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది- నారా భువనేశ్వరి

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు. ‘ఏ ఆధారాలు లేని స్కిల్, రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబును ఇరికించారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భందించారు. తెలుగువారి పౌరుషం ఏంటో ఎన్టీఆర్ చూపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దాం’ అని నిజం గెలవాలి యాత్రలో ఆమె అన్నారు. నిజం గెలవాలి బహిరంగ సభ ప్రాంగణానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. జనం మధ్య నుంచి భువనేశ్వరి వేదిక పైకి నడచి వచ్చారు. టీడీపీ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎన్టీఆర్‌కు దీపం పెట్టీ, కొబ్బరి కొట్టి ఆమె నివాళులు అర్పించారు. “హుందా తనానికి మారు పేరు మీరు. మిమ్మల్ని కుంగతీయటానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. మా కోసం, ప్రజలకోసం, రాష్టం కోసం మీరు దైర్యంతో వచ్చినందుకు నమస్కరిస్తూ మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాం. మహిళను అవమానిస్తే తీవ్రంగా శిక్ష వేసే చట్టం వచ్చేలా చేయాలి.” అని పులివర్థి సుధా రెడ్డి అన్నారు. తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొన్నారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొన్నారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్