శ్రీవారి ప్రసాదంపై సీఎం చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ సీఎం జగన్‌ను అభాసుపాలు చేయాలనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వరదలకు సైతం జగనే కారణమంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌పై ఎందుకింత కక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. కావాలనే వివాదాలు సృష్టించి అందరూ చర్చించుకునేలా చేస్తున్నారంటూ అంబటి ఫైర్ అయ్యారు. శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిపై రిపోర్టు వచ్చి రెండు నెలలు అవుతోందన్నారు. కానీ ఇప్పుడే ఎందుకు బయటపెట్టారని అంబటి నిలదీశారు.