పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మన్యం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ సమీపంలో అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ శ్యాంప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఐదు రూపాలయకే పేదలకు ఆకలి తీర్చాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు గత టీడీపీ పాలనలో అన్న క్యాంటీన్ అందుబాటులో తీసుకొచ్చారని తెలిపారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఎత్తివేసి పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. మళ్లీ అన్న క్యాంటీన్ ప్రారంభంతో పేదల ముఖంలో ఆనందం కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు.