రాజా.. ఒక ప్రభుత్వ ఉద్యోగి..! బాబాయి చేసిన మోసంతో ఆస్తి, డబ్బు, ఇల్లు పోగొట్టుకుని, దానికి కారణం అమాయకుడైన తన తండ్రి అని భావించి.. అట చిన్నానా మీద, ఇటు కన్న తoడ్రి మీద ద్వేషం పెంచుకుని బతుకుతుంటాడు.
అక్షయ.. కాలేజ్‌లో గోల్డ్ మెడలిస్టు..! ఏదీ ఆలోచించకుండా అందరికి సహాయం చేస్తుంది. ఎన్నో బాధలు ఉన్నా ఆమెకు కుటుంబం అంటే పంచప్రాణాలు. కుటుంబమే వద్దు అనుకుంటున్న అబ్బాయి, కుటుంబమే సర్వస్వం అనుకుంటున్న అమ్మాయికి దెగ్గరైతే ఏమవుతుంది?
ఇలాంటి ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే జెమినీ టీవీలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతున్న సరికొత్త ధారావాహిక “నువ్వే కావాలి” చూడాల్సిందే. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6. 30కు ఈ సీరియల్ ప్రసారం కానుందని యాజమాన్యం ప్రకటించింది.