తెలంగాణలో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. లేడీ కొరియోగ్రాఫర్ ని వేధించినందుకు కేసులో జానీ మాస్టర్ భార్యని నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ ని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదు పై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.