వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేవుడికి అపచారం చేయాలనేదే వైసీపీ అజెండా అని అన్నారు. గతంలో పింక్ డైమండ్ అంటూ, లేని పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని, తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. దేవుడు కూడా తమను ఏమి చేయలేడు అనే అహంభావం వైసీపీకి ఉందన్నారు. నమ్మకం లేని చోట వచ్చి, దేవుడి మీద పెత్తనం చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడు స్వామి వారి దర్శనానికి వెళ్ళినా, క్యూ లైన్ లోనే వెళ్తానని సీఎం చెప్పారు. సాంప్రదాయం పాటించమంటే, బూతులు తిట్టాడుతున్నారని ఫైర్ అయ్యారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.