నాంపల్లి కోర్టుకు పూచీకత్తు సమర్పించిన అల్లు అర్జున్

 

నటుడు అల్లు అర్జున్‌ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన వెంట మామ చంద్రశేఖర్‌ రెడ్డి ఉన్నారు. ఇద్దరూ కలిసి కోర్టుకు వచ్చారు. బెయిల్ , పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసానికి అల్లు అర్జున్‌ వెళ్లిపోయారు.

డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌కి శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గత నెల 30న వాదనలు పూర్తయ్యయి. శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లి రెండో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్‌ అప్పటి వరకు హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌పై ఉన్నారు.  నాంపల్లి కోర్టు షరుతులతో కూడిన సాధారణ బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. హత్యకు, హత్యకు సంబంధించి అల్లు అర్జున్‌ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభించిందని అందుకే బెయిల్ మంజూరు చేసిందని అల్లు అర్జున్‌ తరపు న్యాయవాది తెలిపారు.

పుష్ప 2 రిలీజ్‌ డే రోజున సంథ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవంత్‌ అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్