ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. మంత్రి నారా లోకేశ్ విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కాలేజిలోని కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. విద్యార్ధులు బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి, కుంటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
మంగళగిరిలో 2019లో ఓడిపోయాను. కానీ పట్టుదలతో శ్రమించి రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించాను. జీవితంలో గెలుపు ఓటములు సహజమే. పరీక్షలు తప్పితే చాలా మంది విద్యార్ధులు సూసైడ్ చేసుకుంటున్నారు. స్టూడెంట్స్ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించాం. పుస్తకాల్లో ఆటలకు పురుషుల బొమ్మలు, ఇంటి పనులకు బాలికల బొమ్మలు ఉన్నాయి. పుస్తకాలల్లో ఈ అసమానతను తొలగించాలని అధికారులను ఆదేశించానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.