గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరోగళం ఏర్పడింది. వైసీపీ కార్పొరేటర్ల తీరుపై కమిషనర్ పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో పుస్తకాలు విసిరివేసి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు.
సమావేశంలో వైసిపి కార్పొరేటర్లు, కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వైసీపీ నేతలు మాట్లాడిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్.. అధికారుల తీరును విమర్శిస్తూ తమాషాగా ఉందా అంటూ మండిపడ్డారు. వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడిన వ్యాఖ్యల పై మునిసిపల్ కమిషనర్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.