ఏపీలో గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ప్రభుత్వం అనుమతించింది. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది. కియారా అద్వానీ కథానాయిక. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600గా ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.135కు పెంచుతూ అనుమతి చ్చింది. మల్టీప్లెక్స్ టికెట్‌కు అదనంగా రూ.175. ఈనెల 10 నుంచి 23 వరకు టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది