తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం

   తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా లంచగొండులపై కొరడా ఝుళిపించింది. నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు శాఖల్లోని అవినీతి చేపలను పట్టుకు నేందుకు వేట కొనసాగించింది. దీంతో ఏసీబీ వలకు 9 మంది ఉద్యోగులతోపాటు మరొకరు చిక్కారు.

రంగారెడ్డి జిల్లా రెడ్‌హిల్స్‌ నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగిన ఏసీబీ రైడ్స్‌లో ముగ్గురు అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాన్‌పూర్‌లో భవన నిర్మాణానికి, ఇరిగేషన్‌ అనుమతుల కోసం ఉపేంద్రనాథ్‌రెడ్డి దర ఖాస్తు చేసుకొన్నాడు. అయితే, అతడికి ఎన్‌వోసీ ఇవ్వడానికి ఇరిగేషన్‌ ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్‌ భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కే కార్తీక్‌, మరో సెక్షన్‌ ఏఈ నికేశ్‌కుమార్‌ రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. ముందుగానే లక్షన్నర తీసుకున్నా కూడా.. మళ్లీ లంచం కోసం అనుమతులకు ఇబ్బందులు పెట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర యించాడు. దీంతో పక్కా మాటు వేసిన ఏసీబీ ఉపేంద్రనాథ్‌ నుంచి ముగ్గురు అధికారులు లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న గండిపేట సర్వేయర్‌ గణేశ్‌ కూడా 40 వేల లంచం తీసుకుం టూపట్టుబడ్డాడు. మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది.

అలాగే విద్యుత్‌ శాఖలోనూ అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వెన వద్ద కాంట్రాక్టర్‌ ఎన్‌ ప్రవీణ్‌, లక్ష్మీనారాయణకు చెందిన రెస్టారెంట్ కు పోల్ వేయడం, ట్రాన్స్​ఫార్మర్, త్రీ ఫేస్ కరెంట్​ఇచ్చేం దుకు విద్యుత్ ఆఫీస్ అధికారులు 21 వేల రూపాయలు లంచం అడి గారు. దీంతో ప్రవీణ్‌ ఏసీబీ అధికారులను ఆశ్ర యించాడు. పక్కా ప్లాన్‌ ప్రకారం రైడ్స్‌ చేసిన ఏసీబీ ఎస్‌ఈ నాగేంద్రకుమార్‌, డీఈ నరేందర్‌, ఏఈ మధుకర్‌లు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. చట్టాలను పరిరక్షించాల్సిన పోలీస్‌ అధికారులు కూడా భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మేడ్చల్‌ జిల్లా కుషాయి గూడ పోలీస్ స్టేషన్‌ లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు. సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వీరాస్వామి, ఎస్ఐ షఫిలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సింగిరెడ్డి భరత్‌రెడ్డిపై భూ వివాదం కేసు నమోదైంది. ఈ కేసును క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం సీఐ, ఎస్‌లను పట్టుకున్నారు. మరోపక్క గొర్రెల స్కామ్‌పై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా పశుసంవర్థకశాఖ మాజీ సీఈ రాంచందర్‌రావు, కల్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారిపట్టించడంతో వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరించింది. కోర్టు వీరిద్దరికీ 14 రోజుల రిమాండ్​ విధించడంతో చంచల్​గూడ జైలుకు తరలించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులు, బినామీ అకౌంట్‌‌‌‌ హోల్డర్ల ను కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది ఏసీబీ.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్